12-12-2025 12:11:07 AM
ఎస్పీ డి.జానకి
మహబూబ్ నగర్ టౌన్, డిసెంబర్ 11: గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి విడత ఫలితాల నేపథ్యంలో, విజయాలు సాధించిన అభ్యర్థులు వారి అనుచరులు ఎలాంటి ర్యాలీలు, బైక్ ర్యాలీలు, బానసంచలు, డీజేలు, పెద్ద ఎత్తున గుమిగూడడం వంటి కార్యక్రమాలు ఏవీ నిర్వహించకూడదని మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ డి.జానకి ఆదేశించారు. ఎన్నికల నియమావళి ప్రకారం ఈ రకమైన కార్యక్రమాలు పూర్తిగా నిషేధించబడ్డాయని స్పష్టం చేశారు. ప్రజల్లో ఉద్రిక్తతలు, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ప్రతి అభ్యర్థి, అనుచరులు నియ మాలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు.
ఎవరు ఈ నిబంధనలు ఉల్లంఘించినా, వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసేందుకు పోలీసుల పర్యవేక్షణను మరింత బలపరచినట్లు తెలిపారు. జిల్లాలో శాంతి భద్రతల కోసమే ఈ చర్యలు తీసుకుంటున్నామని, ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.