calender_icon.png 13 December, 2025 | 8:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అల్ఫోర్స్ ఇ- టెక్నో స్కూల్ లో ఘనంగా పేరెంట్స్ క్రీడోత్సవ్

13-12-2025 07:06:29 PM

కొత్తపల్లి (విజయక్రాంతి): కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలలో శనివారం పేరెంట్స్ క్రీడోత్సవ్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. క్రీడల పోటీల ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి హాజరై వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏమైందిరా సమాజంలో తల్లిదండ్రుల పాత్ర చాలా అమూల్యమైనదని, వారు చేసే కృషి సమాజాభివృద్ధికి తోడ్పాటు అందిస్తుందని అన్నారు.

నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం చాలా విచారకరమని, ఈ విధానానికి స్వస్తి పలకాలని అన్నారు. తల్లిదండ్రులకు అన్ని వేళల్లో సేవలు చేయడమే కాకుండా అందుబాటులో ఉండి సమాజంలోని అభివృద్ధి కార్యక్రమాలకు చేయూతనివ్వాలని చెప్పారు. వేడుకలలో భాగంగా తల్లిదండ్రులకు ఖోఖో, చెస్, క్యారమ్స్, టెన్నికాయిట్, బ్యాడ్మింటన్, తదితరల పోటీలను నిర్వహించారు. అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన వారికి వార్షికోత్సవ వేడుకలలో బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, వ్యాయామ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.