calender_icon.png 12 December, 2025 | 12:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈటూరు పంచాయతీ ఎన్నికల్లో తేలని ఫలితం

12-12-2025 12:13:54 AM

  1. ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఓట్లు
  2. రీకౌంటింగ్ నిర్వహిస్తున్న అధికారులు

సూర్యాపేట, డిసెంబర్ 11 (విజయక్రాంతి) : జిల్లాలోని నాగారం మండలం ఈటూరు గ్రామంలో గురువారం జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు వంగూరి దామోదర్, గంగిబిక్షం సమానంగా ఓట్లు వచ్చినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. దీంతో అభ్యర్థులు రీకౌంటింగ్ చేయాలని సూచించగా మళ్లీ రీకౌంటింగ్ చేస్తున్నారు. రీ కౌంటింగ్ లో కూడా టై అయితే డ్రా తీస్తామని అధికారులు చెప్పినట్లు అభ్యర్థులు సమాచారం ఇచ్చారు..

కాగా దామోదరనే సర్పంచ్ అభ్యర్థికి 7 ఓట్లు ఎక్కువ రాగా అవి చెల్లనివిగా తేల్చారని వాటిని మళ్లీ పరిశీలించి నాకు న్యాయం చేయాలని ఆయన ఎన్నికల అధికారులకు కోరారు. తదుపరి వాటిని చెల్లని ఓట్లుగా గుర్తించిన అధికారులు ఇద్దరి సమానంగా  ఓట్లు వచ్చినట్లు ప్రకటించారు. అధికారులు మరోసారి రీ కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. గ్రామస్తులంతా ఫలితం కోసం ఉత్కంఠతతో ఎదురుచూస్తున్నారు.