calender_icon.png 2 August, 2025 | 6:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుంకిశాల రోడ్డులో ఏర్పడిన గుంతను పూడ్చాలి

02-08-2025 12:20:06 AM

వలిగొండ, ఆగస్టు 1 (విజయక్రాంతి): వలిగొండ మండల కేంద్రంలోని సుంకిశాల రోడ్డులో ఏర్పడిన గుంతను పూడ్చాలని సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి, మండల కార్యదర్శి వర్గ సభ్యులు కూర శ్రీనివాస్ లు డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలోని సుంకిశాల రోడ్డులో కమాన్ వద్ద ఏర్పడిన గుంత వల్ల అనేకమంది ప్రయాణికులు ఇబ్బంది పడుతున్న పట్టించుకోని అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుమారు  నెల రోజులుగా గుంత ఏర్పడి ఆ రోడ్డు మార్గం ద్వారా ప్రయాణం చేసే పట్టణ కేంద్రానికి చెందిన ప్రయాణికులతో పాటు, సుంకిశాల,పులిగిల్ల గ్రామాలకు చెందిన ప్రయాణికులతో పాటు ఇతర గ్రామాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఈ రోడ్డు మార్గం ద్వారా వలిగొండ నుండి కాటేపల్లి వరకు కొనసాగుతున్న డబుల్ రోడ్డు నిర్మాణం కోసం వెళ్లే అనేక మట్టి కంకర టిప్పర్లతో పాటు సుంకిశాల గ్యాస్ కంపెనీకి చెందిన వాహనాలు నిరంతరం ప్రయాణించడం జరుగుతుందని అధికారులు.

ఈ రోడ్డు మార్గం ద్వారా రోడ్డు పనులను పర్యవేక్షించేందుకు నిరంతరం ప్రయాణం చేస్తున్న ఏమాత్రం పట్టించుకోకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనమని వెంటనే ఇప్పటికైనా అధికారులు స్పందించి గుంతను పూడ్చాలని డిమాండ్ చేశారు. ఈ గుంతలో అనేకమంది ద్విచక్ర ప్రయాణికులు ఇప్పటికే పడిపోయారని ఎవ్వరికి ఎలాంటి ప్రమాదం జరగక ముందే అధికారులు స్పందించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి గర్దాసు నరసింహ, మండల కమిటీ సభ్యులు కొండే కిష్టయ్య, ఉద్యమకారుల సంఘం జిల్లా నాయకులు బత్తిని రవీందర్, సిపిఎం పట్టణ నాయకులు కొండూరు సత్తయ్య,శీలం ఇందిర,వేముల లక్ష్మయ్య , ధ్యానబోయిన యాదగిరి, ఆలకుంట్ల నరసింహ, కొమ్ము స్వామి, రేగు ఇస్తారి, మైసొల్ల నరేందర్, చేగురి రాములు, అండాలు, ఈదమ్మ తదితరులు పాల్గొన్నారు