calender_icon.png 21 July, 2025 | 11:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యాసంస్థల బంద్ విజయవంతం చేయండి

21-07-2025 06:10:39 PM

ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి రాము యాదవ్..

హుజురాబాద్ (విజయక్రాంతి): ఈనెల 23న రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థ బంద్ ను విజయవంతం చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి కేశబోయిన రాము(AISF District Assistant Secretary Keshaboina Ramu) పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విద్యారంగా సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయంబర్స్మెంట్, బకాయిలను విడుదల చేయాలని బంద్ కు పిలుపునిచ్చినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు కావస్తున్నప్పటికీ విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్,ఎంఈఓ, డిఓ, పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.