calender_icon.png 21 July, 2025 | 10:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భద్రత ప్రమాణాలు పాటించడం ద్వారా ప్రమాదాల నివారణ

21-07-2025 06:14:33 PM

బెల్లంపల్లి రీజియన్ సేఫ్టీ జిఎం రఘుకుమార్..

మందమర్రి (విజయక్రాంతి): సింగరేణి కార్మికులు భద్రత ప్రమాణాలు పాటిస్తూ స్వీయ రక్షణతో విధులు నిర్వహించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని బెల్లంపల్లి రీజియన్ సేఫ్టీ జనరల్ మేనేజర్ రఘుకుమార్, ఏరియా ఇంచార్జ్ జనరల్ మేనేజర్ విజయ్ ప్రసాద్ లు అన్నారు. పట్టణంలోని స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్(Skill Development Training Center)లో సోమవారం ఈపి ఆపరేటర్స్, ఎంవి డ్రైవర్లకు రెండు రోజుల సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ అమలుపై శిక్షణ కార్యక్రమం, రక్షణ అంతర్గత విభాగంచే ప్రారంభించారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఈపి ఆపరేటర్స్, ఎంవి డ్రైవర్స్ భద్రత ప్రమాణాలు పాటిస్తూ, జాగ్రత్తగా విధులు నిర్వహించాలని, గనులలో ప్రమాదాల నివారణకు సిఎంఆర్ 2017లో నిర్దేశించిన రెగ్యులేషన్ ప్రకారం సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ అమలు పరచడం, ఎస్ఎంపి పాటించాలని, ఏమైనా లోటుపాట్లు ఉంటే సంబంధిత సూపర్వైజర్లు, అధికారుల దృష్టికి తీసుకువచ్చి భద్రత చర్యలు చేపట్టి ప్రమాదాలు నివారించాలన్నారు. 

సింగరేణిలో రక్షణ పెంపొందించడానికి యాజమాన్యం తన వంతు బాధ్యతగా శిక్షణ కార్యక్రమాలు చేపడుతుందని వారు గుర్తు చేశారు. ఈపీ ఆపరేటర్స్, ఎంవి డ్రైవర్స్ రక్షణ చర్యలను పూర్తిగా అవగాహన చేసుకోని ప్రమాద రహిత సింగరేణిగా తీర్చిదిద్ది సంస్థ లక్ష్యాన్ని సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏరియా సేఫ్టీ ఆఫీసర్ భూ శంకరయ్య, ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ సలేంద్ర సత్యనారాయణ, వృత్తి శిక్షణ కేంద్రం మేనేజర్ శంకర్, రక్షణాధికారి విజయ్ కుమార్, వృత్తి శిక్షకులు అశోక్ లు పాల్గొన్నారు.