మహోత్సవాన్ని విజయవంతం చేయాలి
యాదాద్రి భువనగిరి జూన్ 9 ( విజయ క్రాంతి ): వన మహోత్సవాన్ని అన్ని శాఖలు సమన్వయం చేసుకుంటూ విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ హనుమంత రావు అన్నారు. సోమవారం రోజు వీడియో కాన్ఫరెన్స్ సమావేశం మందిరంలో డి ఎఫ్ ఓ పద్మజా అధ్యక్షత న జరిగిన సమావేశం లో స్థానిక సంస్థ ల జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు లతో కలిసి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా లో 20.531లక్షలు మొక్కలు నాటాలన్నారు. మొత్తం మొక్కలు నాటెందుకు సిద్ధం చేశారని తెలిపారు. జిల్లాలోని అన్ని మొక్కలు నాటే ప్రదేశాలను గుర్తించి, ఆ ప్రదేశాలు TGFMIS వ్బుసైట్ లో జియో-కోఆర్డినేట్ లతో నమోదు చేయాలని ఆన్నారు. ఈ సమావేశం లో భువనగిరి రెవిన్యూ డివిజనల్ అధికారి కృష్ణా రెడ్డి, సీఈఓ శోభారాణి,డి ఆర్ డి ఓ నాగిరెడ్డి, జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
దరఖాస్తులను పెండింగ్‌లో లేకుండా పరిష్కరించాలి
కలెక్టర్ హనుమంతరావు
యాదాద్రి భువనగిరి జూన్ 9 ( విజయ క్రాంతి ): వివిధ ప్రాంతాల ప్రజల సమస్యల నుండి వచ్చిన దరఖాస్తులను పెండింగ్ లేకుండా వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. సోమవారం రోజు కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల ప్రజల నుండి 41 అర్జీలను జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు తో కలసి స్వీకరించారు. సంబంధిత అధికారులు దరఖాస్తులను పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలన్నారు.
అందులో రెవిన్యూ శాఖ 28,జిల్లా పరిషత్ 4, మున్సిపాలిటీ 3,జిల్లా పంచాయతీ శాఖ 2, హౌసింగ్, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ, పశు వైద్య శాఖ, ఎస్సీ కార్పొరేషన్ శాఖలకు ఒక్కొకటి చొప్పున వచ్చాయని తెలియజేశారు. వివిధ శాఖలకు వచ్చిన దరఖాస్తులను తక్షణమే పరిశీలించి ప్రజల సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ శోభా రాణి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.






