18 April, 2026 | 12:06 AM

ప్రజావాణి ఆర్జీలకు పరిష్కారం చూపాలి

10-06-2025 12:28 AM

సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్లు గరీమ అగర్వాల్, అబ్దుల్ హమీద్

కొండపాక, జూన్ 9: ప్రజావాణి అర్జీలకు గుణాత్మక పరిష్కారం చూపాలని జిల్లా అదనపు కలెక్టర్ గరీమ అగర్వాల్ ప్రభుత్వ జిల్లా అధికారులకు సూచించారు. ఆర్జిదారుల ఫిర్యాదులు, వినతులను పరిశీలించి పరిష్కరించాలన్నారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయ సముదాయంలో ప్రజావాణి కార్యక్రమాని సోమవారం నిర్వహించారు. ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదుదారుల నుంచి దరఖాస్తులను జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ అబ్దుల్ హమీద్ తో కలసి స్వీకరించారు.

దరఖాస్తుదారులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకుని, బాధితుల సమస్యలు పరిశీలించి పరిష్కరించాలని సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కి 88 దరఖాస్తులు వచ్చాయని వెల్లడించారు.  ఈ కార్యక్రమంలో డిఆర్‌ఓ నాగరాజమ్మ జిల్లా వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.