calender_icon.png 3 July, 2025 | 5:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డబుల్’ ఇండ్లను లబ్ధిదారులకు ఇవ్వాలి

10-06-2025 12:32:28 AM

చేవెళ్ల, జూన్ 9: మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని అజీజ్ నగర్ రెవెన్యూలో ని ర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను  లబ్ధిదారులకు ఇవ్వాలని  సీపీఎం చేవెళ్ల డివిజన్ కార్యదర్శి అల్లి దేవేందర్ కోరారు. ఈ మేరకు సోమవారం రంగారెడ్డి  కలెక్టర్ కా ర్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో  హౌసింగ్ పీడీకి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ.. 

తాగునీరు, విద్యుత్ సరఫరా మినహా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం  పూర్తయ్యిందని తెలిపారు. పెండింగ్ పనుల కోసం ఇప్పటికే  నిధులు కూడా మంజూరు చేసి టెండర్లు కూ డా పిలిచామని చెప్పారు. రెండు వారాల్లో  తాగునీరు, విద్యుత్ సదుపాయం కల్పించి  లబ్ధిదారులకు కేటాయిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నేతలు డప్పు ప్రవీ ణ్ కుమార్,  అరుంధ,  రవి సతీష్ రాజు క మలమ్మ తదితరులుపాల్గొన్నారు.