07-07-2025 01:01:25 AM
ములకలపల్లి జూలై 6 (విజయక్రాంతి): ఈనెల 9న దేశ వ్యాపిత సార్వత్రిక సమ్మె ను జయప్రదం చేయాలని టియుసిఐ జిల్లా సహాయ కార్యదర్శి నూపా భాస్కర్,సిఐటి యు మండల కన్వీనర్ నిమ్మల మధు, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి యూసఫ్ పిలుపు నిచ్చారు.మండల కేంద్రంలోని సిఐటియు కార్యాలయంలో ఆదివారం సిఐటియు, ఏఐటీయూసీ,టియుసిఐ, కార్మిక యూనియన్ల ఆధ్వర్యంలో జరిగిన ముఖ్య కార్యకర్తల స మావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
దేశం లో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలను ఖండించాలని కోరారు.ఈ కార్యక్రమంలో రైతు సం ఘం రాష్ట్ర కమిటీ సభ్యులు నరాటి రమేష్, వ్యవసాయ కార్మిక సంఘం డివిజన్ కార్యదర్శి పోతుగంటి లక్ష్మణ్,ఏఐవైఎఫ్ నాయ కులు సమ్మయ్య, తదితరులు పాల్గొన్నారు.