07-07-2025 01:02:58 AM
ఖమ్మం, జూలై 6 (విజయక్రాంతి): ది ఖమ్మం మర్చంట్స్ అసోసియేషన్ వారి ఆశయం మేరకు ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో విలీనం చేసినట్లుఅధ్యక్షులుచిన్ని కృష్ణా రావు, ప్రధాన కార్యదర్శిమెంతుల శ్రీశైలం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.ఆదివారం జరిగిన సర్వసభ్య సమావేశంలో పలు విషయాలు తీర్మానం చేశారు. ఈ సంఘం 19 వాణిజ్య విభాగాల నుండి ఏర్పడిన 1200 పై చిలుకు మంది గౌరవ సభ్యులతో విస్తరించిందని వారు తెలిపారు.
బ్యాంకు ఖాతాల నిర్వహణ, పాన్ కార్డ్ అనుసంధానం వంటి అంశాలపై చర్చించి, సభ్యుల ఏకగ్రీవ అంగీకారంతో నూతనంగా 26/2022 నంబరుతో నూతన సొసైటీగా 9 మంది అధికార ప్రతినిధులతో రిజిస్ట్రేషన్ చేయబడింది. అంతకు ముందు సభ్యులందరిని పునరాలోచన చేసి, కొత్త సభ్యులుగా అందరికీ సభ్యత్వం నమోదు గావించారు. ఈ ఎన్నికలు శ్రీ రాములు ఎన్నికల అధికారిగా వ్యవహరించి నిర్వహించినారు.
భవిష్యత్తు లో సంస్థ ఛాంబర్ అఫ్ కామర్స్ అనే నామకరణంతోనే చట్టబద్ధంగా కొనసాగించాలనే నిర్ణయించినట్లు వారు తెలిపారు ఈ కార్యక్రమం లో గౌరవ అధ్యక్షులుమేళ్లచెరువు వెంకటేశ్వర రావు, పూర్వపు గౌరవ అధ్యక్షులు కొప్పు నరేష్ కుమార్ తదితరులుపాల్గొన్నారు.