14-05-2025 12:00:00 AM
కార్మిక సంఘాల జేఏసీ
మందమర్రి, మే 13 : కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతి రేక విధానాలను నిరసిస్తూ జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చిన దేశ వ్యాప్త సమ్మెను ఈ నెల 20న సింగరేణిలో విజయవంతం చేయాలని కార్మిక సంఘాల జేఏసీ నాయకులు కోరారు. పట్టణంలోని ఏఐటీయుసీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన కార్మిక సంఘాల జేఏసీ సమావేశంలో వారు మాట్లాడారు.
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను 4 కోడ్‌లుగా విభజిస్తూ కార్మికులను కట్టు బానిసలుగా చేస్తున్న కార్మిక చట్టాల మార్పు ను వెంటనే ఉపసంహరించుకొని, పాత పద్ధతిలో 44 కార్మిక చట్టాలను కొనసాగించా లని వారు డిమాండ్ చేశారు. కార్మిక చట్టాల మార్పును నిరసిస్తూ గతంలో అనేక పోరాటాలు చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకు పోయి నప్పటికి పట్టించుకోకుండా, కేంద్ర ప్రభు త్వం ఏకపక్షంగా వ్యవహరిస్తూ కార్పొరేట్ శక్తులకు ప్రభుత్వ రంగ సంస్థలను కట్ట పెట్టడానికి నాలుగు లేబర్ కోడ్ లను తీసుకు వస్తుందని మండిపడ్డారు.
ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు శక్తులకు దార దత్తం చేయడాన్ని నిర సిస్తూ ఈనెల 20న ఒక్కరోజు టోకెన్ సమ్మెలో సింగరేణి కార్మికులు పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి సమ్మె ద్వార తగిన బుద్ధి చెప్పాలని వారు కోరారు.
ఈ సమావేశంలో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటియుసి) ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్, నాయకులు ఎండీ అక్బర్ అలీ, శైలేంద్ర సత్యనారాయణ, దాగం మల్లేష్, భీమనాథుని సుదర్శనం, కంది శ్రీనివాస్, సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) అధ్యక్షులు తుమ్మల రాజిరెడ్డి, నాయకులు సాంబారు వెంకటస్వామి,
వడ్లకొండ ఐలయ్య, ఐఎన్టియుసి ఏరియా ఉపాధ్యక్షులు దేవి భూమ య్య, నాయకులు చంద్రశేఖర్, టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షులు మేడిపెల్లి సంపత్, నాయకులు ఓ రాజశేఖర్, శివ నాయక్, జి రామచందర్ లు పాల్గొన్నారు.