02-08-2025 11:36:23 PM
కోనరావుపేట,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆదేశాల మేరకు మార్కెట్ కమిటీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు షేక్ ఫీరోజ్ పాషా, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు కేతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి తో కలిసి ముఖ్యమంత్రి సహాయ నిధి 12 లక్షల 92 వేల 500 రూపాయల చెక్కులను 40 మంది లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగినది.