02-08-2025 11:10:06 PM
కూరలు కూడా లేవు
టి సి ఇస్తామని బెదిరింపులు
అశ్వారావుపేట,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం పరిధిలోని దమ్మపేట మండలం చీపురుగూడెం ఆశ్రమ పాఠశాలకు చెందిన విద్యార్థులకు తమకు నెల రోజులుగా సక్రమంగా భోజనం పెట్టడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న ఘటన శనివారం జరిగింది. కొందరు విద్యార్థులు పాఠశాలలో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను సామాజిక మాధ్యమాలలో పెట్టారు. విద్యార్థులను హెచ్ఎం, వార్డెన్లు పట్టించుకోవటం లేదని, భోజనం సక్రమంగా పెట్టటంలేదని, మెనూ ప్రకారం ఇవ్వటం లేదంటూ పాఠశాల విద్యార్థు ఆవేదన వ్యక్తం చేశారు.
దోమలు కుట్టి తమకు జ్వరాలు వస్తున్నాయని, ప్యాన్లు చెడిపోయిన బాగు చేయించటం లేదని ,ఎవరైన మాట్లాడితే టీసి ఇచ్చి పంపిస్తానని బెదిరిస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు. భోజనం బాగోక పోవటంతో అంతా చెత్త డబ్బాలో వేస్తున్నట్లు విద్యార్థులు చూపెట్టారు. ఇప్పటికైన పాఠశాలలో సమస్యలు పరిష్కరించి మెనూ ప్రకారం భోజనం పెట్టాలని విద్యార్థులు కోరుతున్నాను. ఈవిషయం తెలుసుకున్న డీడి సరస్వతి, గిరిజన సహాయసంక్షేమశాఖా అధికారి చంద్రమోహన్ పాఠశాలను సందర్శించి విచారణ చేపట్టారు.
పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే జారే...
చీపురుగూడెం పాఠశాలలో విద్యార్థులకు భోజనం సక్రమంపెట్టటం లేదని తెలుసుకున్న ఎమ్మెల్యే జారే ఆదినారాయణ శనివారం సాయంత్రం పాఠశాలను సందర్శించి విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈసంఘటనపై ఉపాద్యాయులలతో అధికారులతో చర్చించి బాద్యులపై చర్యలు తీసుకోవాలన్నారు.
విద్యార్థులకు బోజనం పెట్టలేని ప్రభుత్వం... మాజీ ఎమ్మెల్యే మెచ్చా
| విద్యార్థులకు నెల రోజులుగా ఆశ్రమపాఠశాలలోని విద్యార్థుల ఆకలి అలమట్టిస్తున్నారని ఉడకని అన్నం, కుళ్ళిన పండ్లు ఇస్తూ విద్యార్థులను ఇబ్బం దులకు గురి చేయాటాన్ని అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు శనివారం సాయంత్రం ప్రకటనలో ఖండించారు. ఇది ప్రభుత్వ వైఫల్యమేనని చర్యలు తీసుకొని విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని డిమాండ్ చేసారు.