02-08-2025 11:32:01 PM
నల్గొండ ఐటీ సెల్ ఎస్ఐ ఆర్ నాగరాజుకు నూతనకల్ ఎస్సైగా పోస్టింగ్
నూతనకల్,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న వాస ప్రవీణ్ కుమార్, అదే పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఒక మహిళా కానిస్టేబుల్ ను కొద్దికాలంగా వేధింపులకు గురి చేస్తుండడంతో, బాధితురాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో పై అధికారులు నిందిత ఎస్సై పై అంతర్గత విచారణ జరిపి, అది నిజమే అని తేలడంతో శనివారం డిఐజి కార్యాలయానికి అటాచ్ చేశారు. అలాగే నల్గొండ ఎస్పీ కార్యాలయంలోని ఐటీ సెల్ లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న ఆర్ నాగరాజు ను నూతనకల్ ఎస్సైగా ట్రాన్స్ఫర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.ఎస్సై ప్రవీణ్ కుమార్ పై గతంలోనూ శాలిగౌరారం లో ఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్నప్పుడు కూడా స్థానిక మహిళను వేధింపులకు గురి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.