02-08-2025 11:39:30 PM
రాజుపేట గ్రామంలో బ్యాంకు కార్యక్రమం – ప్రజల నుంచి మంచి స్పందన
గంభీర్రావుపేట,(విజయక్రాంతి): యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గంభీర్రావుపేట శాఖ ఆధ్వర్యంలో రాజుపేట గ్రామంలో జనసురక్షా సాచురేషన్ డ్రైవ్ ను ఏర్పాటు చేశారు. గ్రామస్థుల ఆర్థిక భద్రతను పెంచే లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బ్యాంక్ మేనేజర్ సామల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన , జీవన్ జ్యోతి బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన వంటి కేంద్ర ప్రభుత్వ పథకాలపై సమగ్రమైన అవగాహనను గ్రామ ప్రజలకు అందించారు. ఈ పథకాలకు ప్రజలు అధికంగా నమోదు కావడం విశేషం.