14-05-2025 12:00:00 AM
తుర్కయంజాల్, మే 13: ఈనెల 20న కార్మిక సంఘాలు చేపట్టిన దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ నాయకులు పిలుపునిచ్చారు. తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి మన్నెగూడలోని ఇబ్రహీంపట్నం ఆర్టీవోకు సీఐ టీయూ నేతలు సమ్మెనోటీసు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాం డ్ చేశారు.
కార్మిక చట్టాలను పరిరక్షించుకోవాలని, కనీస వేతనం రూ. 26వేలు అమలు చేయాలని సూ చించారు. అఖిలభారత కార్మిక సం ఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు, అసోసియేషన్ల కార్యాచరణ ఆధ్వర్యంలో చేపట్టిన దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కోరారు.
ఈ కార్య క్రమంలో ప్రైవేట్ ట్రాన్స్ పోర్ట్ డ్రైవ ర్స్ యూనియన్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కడారి రాములు, సీఐటీయూ తుర్కయంజాల్ మున్సిపల్ నాయకులు ఆశీర్వాదం, తుర్కయంజాల్ టాటా ఏస్ ఆటో ట్రాలీ డ్రైవ ర్స్ యూనియన్ నాయకులు రొ క్కం శేఖర్ రెడ్డి, డి రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.