06-09-2025 12:00:00 AM
ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం
ఎల్బీనగర్, సెప్టెంబర్ 5 : ఉద్యమకారుల ఆకాంక్షలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్సీ, ప్రొ కోదండరాం అన్నారు. శుక్రవారం ప్రొఫెసర్ కోదండరాం జన్మదినం సందర్భంగా చైతన్యపురిలోని తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు కాచం సత్యనారాయణ గుప్తా ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యమకారుల ఆశలు ఆకాంక్షలలో భాగమైన 250 గజాల స్థలాన్ని ఇస్తానన్న హామీని నెరవేర్చాలన్నారు. ప్రభుత్వం ఏర్పడి దాదాపు 20 నెలలు గడుస్తున్న ఉద్యమకారుల హామీపై కార్యాచరణ రూపొందించలేదని తెలిపారు. గురుపూజోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులు అందరికీ గురుపూజోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఉపాధ్యాయులను గౌరవించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు.
అనంతరం కాచం సత్యనారాయణ గుప్తా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఉద్యమకారులకు హామీలు ఇచ్చారని , స్థానిక సంస్థల ఎన్నికలలోపు ఆ హామీలు నెరవేర్చాలని కోరారు. కార్యక్రమంలో కేవీ రంగారెడ్డి, కొత్త రవి, శ్యామ్ సుందర్ గౌడ్, రామాచారి, రామ్ నరేష్, తేలుకుంట్ల రాంబాబు, సతీష్, వీరేందర్, మనోహర్, వేణు, అన్వర్ పాషా, శ్రీధర్, బుద్ధ ప్రవీణ్, శ్రీకాకోళ్ల రాజు గుప్తా, కార్తీక్ చారి, మురళి తదితరులు పాల్గొన్నారు.