29-09-2025 09:58:34 PM
ఎమ్మెల్యే
తాండూరు (విజయక్రాంతి): ఎన్ని అడ్డంకులు ఎదురైనా ప్రజలకు సంక్షేమ పథకాలు ఆపబోమని ఎన్ని నష్టాలు వచ్చినా కూడా పేదలకు సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని వికారాబాద్ జిల్లా తాండూర్ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన పెద్దెములు మండలం మంబాపూర్ లో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు సునీత అనే మహిళ కుటుంబ సభ్యులతో కలిసి గృహప్రవేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధితో పాటు ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తామని అన్నారు. అనంతరం లబ్ధిదారులతో కలిసి అధికారులు స్థానిక నాయకులతో కలిసి భోజనం చేశారు.