29-09-2025 10:00:28 PM
ఎల్లారెడ్డిపేట (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లాలో మహాలయ అమావాస్య రోజున ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభం అయిన బతుకమ్మ పండుగ సంబరాలు సోమవారం సద్దుల బతుకమ్మతో బతుకమ్మ పండుగ ముగుస్తుంది. ఎల్లారెడ్డి పేట మండలంలోని అన్ని గ్రామాలలో మహిళలు ఆనందంగా సద్దుల బతుకమ్మలను తీరొక్క పూలతో అందంగా పేర్చి గ్రామాలలోని వీధుల్లో బతుకమ్మ ఆటలు బతుకమ్మ పాటలతో హుషారుగా, సంతోషంగా సద్దుల బతుకమ్మ వేడుకలు జరుపుకుంటారు.
సద్దుల బతుకమ్మలను నిమజ్జనం చేయుటకు గ్రామాలలోని చెరువుకు, వాగులు, కాలువల వద్ద ఆయా గ్రామాలకు చెందిన గ్రామ పంచాయతీ సిబ్బంది, విద్యుత్ శాఖకు చెందిన సెస్ సిబ్బంది బతుకమ్మ ఘాట్ ల వద్ద అన్ని విద్యుత్ లైట్లు, సౌండ్ సిస్టమ్స్ లతో అన్ని ఏర్పాట్లు చేశారు. మహిళలకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా మండలంలోని అన్ని గ్రామాలలో చేసిన ఏర్పాట్లను ఆయా శాఖల అధికారులు పర్యవేక్షించారు.శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలుగ కుండా అన్ని గ్రామాలలోని బతుకమ్మ ఘాట్ లను ఎల్లారెడ్డిపేట పోలీసులు పరిశీలించారు.అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు.