calender_icon.png 5 November, 2025 | 9:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టేకులపల్లిలో 45 మంది అయ్యప్ప భక్తుల మాలధారణ

05-11-2025 07:36:32 PM

టేకులపల్లి (విజయక్రాంతి): టేకులపల్లి మండల కేంద్రంలో బుధవారం 45 మంది అయ్యప్ప భక్తులు మాలధారణ చేశారు. టేకులపల్లికి చెందిన కాంగ్రెస్ మండల మాజీ అధ్యక్షుడు గుండా నరసింహారావు ఆధ్వర్యంలో పాల్వంచ పట్టణంలోని అయ్యప్ప స్వామి గుడిలో నంబూద్రి గురుస్వామి ఆధ్వర్యంలో మాల వేసుకున్నారు. గుండా నరసింహారావు గురుస్వామి 19వ పడి మాల వేసుకోవడం విశేషం. వీరంతా టేకులపల్లిలోని సంత్ సేవాలాల్ తూర్పు గుడి వద్ద పీఠం ఏర్పాటు చేసి పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.