05-11-2025 07:32:41 PM
అచ్చంపేట: ప్రసవ వేదనతో బాధపడుతున్న మహిళను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో 108 వాహనంలో ప్రసవించిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. 108 వాహన సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పునుంతల మండలం లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన పానుగంటి అనితకు పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్ వాహనానికి సమాచారం అందించారు.
స్పందించిన 108 సిబ్బంది ఇఎంటి లక్ష్మణ్, పైలెట్ ఎండి. ఖజా ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. ప్రసవ వేదన అధికం కావడంతో తెలకపల్లి వద్ద ఇఆర్సిపి డాక్టర్ మనీష్ సూచనల మేరకు అంబులెన్స్ లోని సాధారణ కాన్పు చేశారు. ఆమె తన మూడో కాన్పులో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. కుటుంబ సభ్యులు, ఈఎంఈ శీను, పీఎం శ్రీకాంత్ 108 సిబ్బందిని అభినందించారు.