calender_icon.png 3 August, 2025 | 2:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోస్టర్ పాయింట్లతో మాలలకు నష్టం

01-08-2025 01:40:21 AM

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలిసిన రాష్ట్ర మాల సంఘాల జేఏసీ

ముషీరాబాద్, జూలై 31(విజయక్రాంతి) : ఎస్సీ వర్గీకరణలో గ్రూప్ 3 గా విభజించబడిన 26 మాల కులాలకు 22 వ రోస్టర్ పాయింట్ వలన విద్యా ఉద్యోగ రంగంలో నష్టం జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్ డాక్టర్ మందల భాస్కర్, జేఏసీ గౌరవ చైర్మన్ చెరుకు రామచందర్, గ్రేటర్ హైదరాబాద్ మాల సంఘాల జేఏసీ చైర్మన్ బేర బాలకిషన్ (బాలన్న) లు అన్నారు.

కాబట్టి వారికి 22 లోపు రెండు రోస్టర్ పాయింట్లు కేటాయించాలని గురువారం డిప్యూటీ సీఎం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ను  తెలంగాణ మాల విద్యార్థి సంఘాల జేఏసీ చైర్మన్ మాదాసు రాహుల్ రావు, జేఏసీ వైస్ చైర్మన్ చేపూరి నరసింహ, చేపూరి ప్రణయ్ కుమార్ లతో కూడిన ప్రతినిధి బృందం కలసి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ఈ సందర్బంగా వారు  మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 40 లక్షల మంది మాల సమాజానికి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునేది లేదన్నారు