01-08-2025 01:40:40 AM
ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్
ఎల్బీనగర్, జులై 31 : జీహెచ్‌ఎంసీ ఎల్బీనగర్ జోనల్ పరిధిలోని వివిధ కాలనీల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామని జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్ అన్నారు. మన్సూరాబాద్ డివిజన్ లో నెలకొన్న సమస్యలను గురువారం కార్పొరేటర్ కొప్పుల నర్సింహరెడ్డితో కలిసి జోనల్ కమిషనర్ పరిశీలించారు. మన్సూరాబాద్ డివిజన్లోని సిందూర్ ఎన్క్లేవ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైరేంజ్ అపార్ట్మెంట్స్ నివాసితులు ఎదుర్కొంటున్న సమస్యలను స్థానికులు, కార్పొరేటర్ నర్సింహరెడ్డి వివరించారు.
ఆయా కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం, నీరు నిలవడం, ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలు పరిశీలించారు. జీహెచ్‌ఎంసీ సిబ్బందితో వెంటనే స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కారానికి చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. జోనల్ కమిషనర్ ప్రజల వద్దకే వెళ్లి సమస్యలను తెలుసుకోవడం, వాటి పరిష్కారానికి అధికార యంత్రాంగాన్ని మానిటరింగ్ చేయడం నిజంగా అభినందనీయమని కొనియాడారు. హయత్‌నగర్ సర్కిల్ డిప్యూ టీ కమిషనర్ వంశీకృష్ణ, సిందూర్ ఎన్క్లేవ్ వెల్ఫేర్ అసోసియేషన్ హై రేంజ్ అపార్ట్మెంట్స్ అధ్యక్షుడు అనంతరాములు పాల్గొన్నారు.