calender_icon.png 30 December, 2025 | 4:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చొరబాటుదారులను తరిమికొడతాం: అమిత్ షా

30-12-2025 01:16:36 PM

కోల్‌కతా: ఎన్నికల ప్రయోజనాల(Electoral benefits) కోసం పశ్చిమ బెంగాల్‌లోని మమతా బెనర్జీ ప్రభుత్వం(Mamata Banerjee) బంగ్లాదేశీయుల చొరబాట్లను ప్రోత్సహిస్తోందని ఆరోపిస్తూ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ వలసదారులను తరిమేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Union Home Minister Amit Shah) మంగళవారం స్పష్టం చేశారు. కోల్‌కతాలో విలేకరుల సమావేశంలో షా మాట్లాడుతూ... పశ్చిమ బెంగాల్ ప్రజలు(Bengal people) చొరబాట్లపై ఆందోళన చెందుతున్నారని సూచించారు. తాము చొరబాటుదారులను గుర్తించడమే కాకుండా, వారిని తరిమివేస్తామని హెచ్చరించారు. 2026లో బెంగాల్ బీజేపీ ప్రభుత్వం(BJP Government) ఏర్పాటు చేస్తామని అమిత్ షా స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చాక బెంగాల్ కు పూర్వవైభవం తీసుకువస్తామని హామీ ఇచ్చారు. రాజకీయ హింసలో వామపక్షాలను టీఎంసీ మించిపోయిందని అమిత్ షా ఆరోపించారు. 

చొరబాట్ల సమస్యపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ, "భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి కంచె నిర్మాణ సమస్యపై నేను మమతా బెనర్జీకి 7 లేఖలు రాశాను. గత 6 సంవత్సరాలలో, హోం కార్యదర్శి మూడుసార్లు పశ్చిమ బెంగాల్‌ను సందర్శించి రాష్ట్ర ప్రధాన కార్యదర్శితో సమావేశాలు నిర్వహించారు. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి కంచె కోసం భూమి ఇవ్వడానికి టీఎంసీ ప్రభుత్వానికి ఉన్న భయం ఏమిటి? వారికి ఏమైనా బాధ్యత లేదా? లేక మీరు చొరబాట్లు కొనసాగాలని కోరుకుంటున్నారా? అని నేను అడగాలనుకుంటున్నాను. బెంగాల్ ప్రభుత్వం ఈ చొరబాటుదారుల కోసం పత్రాలు తయారు చేస్తోంది. టీఎంసీ చొరబాట్లను ఆపలేదు, బెంగాల్ జనాభా స్వరూపం ప్రమాదకరంగా మారుతోంది." అని అమిత్ షా పేర్కొన్నారు.