18-12-2025 08:03:44 PM
పన్నాల లక్ష్మారెడ్డి, ఉప సర్పంచ్ కాసర్ల పవిత్ర..
కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్..
వేములవాడ (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామానికి నూతంగా ఎన్నికైన సర్పంచ్ పన్నాల లక్ష్మారెడ్డి, ఉప సర్పంచ్ కాసర్ల పవిత్ర వార్డు సభ్యులు బెదిరే మహిపాల్, కులేరి రవి, నంద్యాడపు రజిత, లోకుర్తి శంకర్ లు రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ చేరారు. ఈ సందర్భంగా వారికి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలియజేశీ వారిని ఘనంగా సత్కరించారు. గ్రామాలతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని తెలిపారు. నూతన పాలకవర్గానికి తన వంతు సహాయ సహకారలు అందిస్తామని తెలిపారు.