calender_icon.png 18 December, 2025 | 10:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీనియర్ సిటిజన్లు న్యాయ సేవా కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి

18-12-2025 08:09:14 PM

మిర్యాలగూడ (విజయక్రాంతి): నిరాధారణకు గురైన వృద్ధు(సీనియర్ సిటిజన్)లు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన న్యాయసేవా కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఐదవ జిల్లా అడిషనల్ సెషన్స్ జడ్జి, మిర్యాలగూడ మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఎక్స్ ఆఫీసియో చైర్మన్ కే వీ చంద్రశేఖర్ కోరారు. గురువారం మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సేవా కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. తల్లిదండ్రుల ఆస్తులు పంచుకున్న సంతానం వృద్ధాప్యంలో వారిని నిరధారణకు గురి చేయడం సరికాదన్నారు. సీనియర్ సిటిజన్లకు ఆర్థిక, ఆరోగ్య భరోసా కల్పించడమే లక్ష్యంగా లీగల్ ఎయిడ్ క్లినిక్ ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. బాధితులకు కేంద్రం తరఫున ప్యానెల్ అడ్వకేట్లు న్యాయ సహాయం అందజేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్యానెల్ అడ్వకేట్లు కొంక వెంకన్న, మేక కుమార్ రెడ్డి, ఆర్ఐ కృష్ణయ్య,లీగల్ వాలంటీర్ ధైద సైదులు తదితరులు పాల్గొన్నారు.