calender_icon.png 18 December, 2025 | 9:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తంగళ్ళపల్లి ఐకెపి కేంద్రంలో 9,600 క్వింటాళ్ల వరి కొనుగోలు పూర్తి

18-12-2025 08:01:05 PM

తంగళ్ళపల్లి (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని హెడ్ క్వార్టర్స్‌లో ఉన్న ఐకెపి కేంద్రంలో ఈరోజు దాదాపు 9,600 క్వింటాళ్ల వరి కొనుగోలు విజయవంతంగా పూర్తయ్యింది. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు సజావుగా నిర్వహించడంతో ఐకెపి కేంద్రం నిర్వాహకులను రైతులు అభినందించారు. ఈ కార్యక్రమంలో వైస్ మార్కెట్ కమిటీ చైర్మన్ నేరళ్ల నర్సింగం గౌడ్, మాజీ సర్పంచ్ సత్యనారాయణ రెడ్డి, ఐకెపి సెంటర్ మహిళా సోదరులు గుడ్డి రేణుక, శైలజతో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఎంసీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరళ్ల నర్సింగం లారీ డ్రైవర్‌ను శాలువాతో సన్మానించి, వరి రవాణా సకాలంలో జరిగేలా సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.