calender_icon.png 1 May, 2025 | 6:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సెల్ ఫోన్ దొంగిలించి.. డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసిన వ్యక్తి అరెస్ట్

01-05-2025 12:42:58 AM

  1. ఐదు సెల్ ఫోన్‌లు, ఆటో స్వాధీనం 

కడ్తాల్, ఏప్రిల్ 30 : చిన్నప్పటి నుంచి ఏ పనులు చేయకుండా  మద్యం తాగుతూ చోరీలకు పాల్పడుతున్న ఓ వ్యక్తి కడ్తాల్ పోలీసులు అరెస్ట్ చేసి కేసూ నమోదు చేసిన ఘటన రంగారెడ్డి జిల్లా కడ్తాల్ పోలీస్ స్టేషన్ లో చోటు చేసుకుంది. బుధవారం కడ్తాల్ సీఐ గంగాధర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

కడ్తాల్ పట్టణంలో ఏప్రిల్ 9న బస్ స్టాండ్ లో బడంగ్ పెట్ లోని సరస్వతినగర్ కు చెందిన మేకల కళ్యాణ్, అతని అనుచరులు ఆవుల శ్రీను, వెంకట రమణమ్మ, రాకేష్ అనే వీళ్ళు  కడ్తాల్ లో బస్ లో ఎక్కిఓ వ్యక్తి దగ్గర సెల్ ఫోన్ చోరీ చేసి ఫోన్ పే లాక్ తెలుసుకొని అతని అకౌంట్ నుంచి రూ. 82.600వేరే అకౌంట్ కు బదిలీ చేశారు.

ఈ విషయాన్నీ కడ్తాల్ కు చెందిన బాధితుడు సిమ్మయ్య పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశాడు. కేసూ నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. మరో సారి చోరీ చేయడానికి కళ్యాణ్ అనే వ్యక్తి మైసిగండికి రాగ వారిని పట్టుకొని విచారించగా చోరీ చేసిన విషయం ఒప్పుకున్నారు. స్టేషన్ కు తరలించి రిమాండ్ కు పంపారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు సీఐ తెలిపారు.