01-05-2025 12:44:04 AM
వనపర్తి, ఏప్రిల్ 30 ( విజయక్రాంతి ) : శ్రమను మించిన సౌందర్యం లేదు... కులమతాలు లేవు మనుషులందరూ ఒక్కటే అని చాటి చెప్పిన విశ్వకర్మ బసవేశ్వరుడు ఆదరప్రాయుడని వనపర్తి శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు.
బుధవారం మహాత్మా బసవేశ్వర జయంతిని పురస్కరించుకొని కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు, సంఘ నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శాసన సభ్యులు మాట్లాడుతూ 12వ శతాబ్దానికి చిందిన బసవేశ్వరుడు మానవులంతా ఒక్కటే అని కుల మతాలు లేవని ప్రగాఢంగా నమ్మి ప్రజలను అవగాహన కల్పించారని తెలియజేశారు.
మూఢ నమ్మకాలను నమ్మవద్దని, సమానత్వం, శోషలిజం వంటి సిద్ధాంతాలను ప్రచారం చేసి ప్రజలకు దిశానిర్దేశం చేశారని కొనియాడారు. జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ బసవేశ్వరుడు శ్రమకు మించిన సౌందర్యం లేదని, ఏ పని చేసిన నిష్టతో అంకిత భావంతో పనిచేయాలని బో ధించిన బోధనలు ప్రతి ఒక్కరికి స్పూర్తినిస్తాయని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు, డి.సి.డి.బి అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ,ఆర్డీఓ సుబ్రమణ్యం, జిల్లా అధికారులు, సంఘ నాయకులు తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు.