calender_icon.png 20 August, 2025 | 6:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య

20-08-2025 12:00:00 AM

 జహీరాబాద్, ఆగస్టు 19: కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లా హుమ్నాబాద్ తాలూకాకు చెందిన మాధవ గిరి అనే వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఝరాసంగం ఎస్త్స్ర క్రాంతి కుమార్ పటేల్ తెలిపారు. మంగళవారం ఝరాసంగం  మండలం కుప్పానగర్ గ్రామ శివారులో గల పాడుబడిన దాబాలో ఉరి వేసుకున్నట్లు ఆయన తెలిపారు.  సమాచారం తెలుసుకొని అక్కడకు వెళ్లి పంచనామా నిర్వహించి శవాన్ని జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని తెలిపారు.

మృతుని వద్ద ఉన్న లైసెన్స్ ఆధారంగా ఆయన కుటుంబీకులకు సమాచారం ఇచ్చామన్నారు. మృతుని భార్య తెలిపిన వివరాల ప్రకారం తన భర్త ఎంఎస్‌ఎస్ కంపెనీలో డ్రైవరుగా పనిచేస్తున్నాడని, ఐదు సంవత్సరాల క్రితం బసవ కళ్యాణ్ లో 5 లక్షల రూపాయల లోన్ తీసుకొని తిరిగి చెల్లించుటకు ఆర్థిక స్తోమత లేకపోవడంతో మనస్థాపం చెంది ఉరి వేసుకున్నట్లుగా తెలిపారు.ఇంతకుముందు కూడా ఇంటి నుంచి వెళ్లి వారం, పది రోజుల వరకు తిరిగి వచ్చేవాడు కాదని,  అదేవిధంగా గత బుధవారం నాడు ఇంటి నుంచి వెళ్లిపోయి తిరిగి రాలేదని ఆమె తెలిపినట్లు ఎస్త్స్ర తెలిపారు. మృతుని భార్య దండుబాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.