బోలెరో వాహనం ఢీకొని వ్యక్తి మృతి
25-04-2026 01:20 AM
మఠంపల్లి, ఏప్రిల్ 24 : బోలెరో వాహ నం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మఠంపల్లి మండలంలోని బక్కమంతుల గూడెం గ్రామ ప్రధాన రహదారి పై చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్ర కారం మఠంపల్లి మండల బక్కమంతుల గూడెం గ్రామానికి గ్రామానికి చెందిన భోగా ల కృష్ణారెడ్డి (45) బోలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అతడు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఎస్త్స్ర పి.బాబు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు.ఈ ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.






