చికాగో అమరవీరుల పోరాట పతాకాన్ని సమున్నతంగా నిలబెడుదాం: ఆర్.జనార్ధన్
ఆలేరు, ఏప్రిల్ 24 : చికాగో అమరవీరుల పోరాట పతాకాన్ని సమున్నతంగా నిలబెడుదామని ఐఎఫ్ టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్.జనార్ధన్ అన్నారు. గురువారం ఆలేరు రైల్వే గేట్ ఐ ఎఫ్ టి యు కార్యాలయంలో సంఘం జిల్లా కమిటీ సమావేశం ను సీనియర్ నాయకుడు కల్లెపు చంద్రయ్య అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ 8 గంటల పనిని అ మలు చేయాలని, కాంట్రాక్టీకరణ, అవుట్ ఔ ట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. కనీస వేతనం 30.000 నిర్ణయించి అమలు చేయాలన్నారు. అలాగే 140 వ మేడే ను జరుపాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభు త్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐ ఎఫ్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డం నాగరా జు, జిల్లా నాయకులు కొంగరి సాయిరాం, పంజాల మురళి, ఊరడి రామ చంద్రు తదితరులు పాల్గొన్నారు.






