calender_icon.png 1 January, 2026 | 4:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆయిల్ ట్యాంకర్ ఢీకొని వ్యక్తి మృతి

01-01-2026 12:00:00 AM

ఘట్ కేసర్, డిసెంబర్ 31 (విజయక్రాంతి) : ఆయిల్ ట్యాంకర్ ఢీకొని ఓ ప్రైవేట్ ఉద్యోగి మృతి చెందిన సంఘటన రాచకొండ కమిషనరేట్ పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం  జీహెచ్‌ఎంసీ పోచారం సర్కిల్ పరిధిలోని వెంకటాపురంకు చెందిన ఈగ మహేష్ (37) జోడిమెట్ల వద్ద మేథా కంపెనీలో ఇంజినీర్ గా పని చేస్తున్నాడు.

బుధవారం తన హోండా యాక్టివా పై ఉద్యోగానికి వెళుతుండగా జోడిమెట్ల మలుపు వద్ద ఉప్పల్ వైపు నుంచి ఘట్కేసర్ వస్తున్న ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ అతివేగంగా నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపి వెనుక నుంచి మహేష్ ను ఢీకొట్టాడు. దీంతో అతని తలకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం వెంటనే మేధా కంపెనీ అంబులెన్స్ లో నీలిమ ఆసుపత్రికి అక్కడ నుండి మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మహేష్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.