19-10-2025 12:00:00 AM
-మద్యం తాగొద్దని అన్నందుకు మనస్థాపం చెందిన లక్ష్మయ్య
- పాపన్నపేటలో ఘటన
పాపన్నపేట, అక్టోబర్ 18 : పురుగు మందు తాగి చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి, ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని ఆరేపల్లిలో శనివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మష్కరి లక్ష్మయ్య(57) వ్యవసాయం చేసుకుంటూ జీవితం గడుపుతు న్నాడు. ఇతనికి ఇద్ద రు భార్యలున్నారు. ఇటీవల కొంతకాలంగా మద్యానికి బానిసగా మారడం తో ఇంటిలో తరచూ చిన్నపాటి గొడవలు జరుగుతున్నాయి.
లక్ష్మయ్య ఈనెల 16న మద్యం సేవించి ఇంటికి రాగా మద్యం తాగొద్దని కుటుంబీకులు నచ్చజెప్పగా మనస్తాపం చెంది ఇంటి నుంచి బయటకు వెళ్లా డు. గుర్తు తెలియని పురుగు మందు సేవించి ఇంటికి వచ్చాడు. లక్ష్మయ్య నోటి నుంచి నురగలు వస్తుండగా కుటుంబీకులు గమనించి చికిత్స కోసం మెదక్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నిమ్స్ ఆస్ప త్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.