19-10-2025 12:00:00 AM
బీఆర్‌ఎస్ తరఫున మాగంటి సునీత, పీ విష్ణువర్ధన్‌రెడ్డి నామినేషన్ దాఖలు
హైదరాబాద్, సిటీ బ్యూరో, అక్టోబర్ 18 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ల ప్రక్రియ ఉత్సాహంగా కొనసాగుతోంది. చివరి గడువు సమీపిస్తుండటంతో అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేసేందుకు పోటెత్తుతున్నారు. నామినేషన్ల స్వీకరణలో ఆరో రోజు భారీ సంఖ్యలో దాఖలయ్యాయి. షేక్‌పేట తహసీల్దార్ కార్యాల యంలోని రిటర్నింగ్ అధికారి కార్యాలయం లో, రిటర్నింగ్ అధికారి పి సాయిరాం నామినేషన్లను స్వీకరించారు.
శనివారం మొత్తం 31 మంది అభ్యర్థులు 48 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. వీరిలో అత్యధికులు స్వతం త్ర అభ్యర్థులు ఉండటం విశేషం. ప్రధాన పార్టీలైన బీఆర్‌ఎస్ తరఫున మాగంటి సునీ త, పి విష్ణువర్ధన్‌రెడ్డి నామినేషన్లు దాఖలు చేయగా, బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డి తరఫున ఆయన ప్రతినిధి సుప్రియ ఒక సెట్ నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఆరో రోజు నామినేషన్ల ప ర్వంలో స్వతంత్ర అభ్యర్థులదే పైచేయిగా నిలిచింది.
కె మురళీకృష్ణ, గడ్డం అనిత, గంగిరెడ్డి కోటిరెడ్డి, తండు ఉపేందర్, జాజుల శ్రీనాథ్, అనిల్ కుమార్ గదెపాక వంటి అనేక మంది స్వతంత్రులు బరిలో నిలిచేందుకు తమ నామినేషన్లు వేశా రు. వీరితో పాటు లోక్‌తాంత్రిక్ జనతాదళ్, తెలంగాణ రాజ్యాధికార సమితి, తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ చిన్న పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఇప్పటివరకు మొత్తం 94 మంది అభ్యర్థులు 127 సెట్ల నామినేషన్లను దాఖలయ్యాయి.