calender_icon.png 20 January, 2026 | 1:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాటర్ హీటర్ షాక్‌తో వ్యక్తి మృతి

20-09-2024 12:00:00 AM

కామారెడ్డి,సెప్టెంబర్ 19(విజయక్రాంతి): ఇంట్లో స్నానం చేసేందుకు వాటర్ హీటర్ పెడుతూ కరెంట్ షాక్‌కు గురై వ్యక్తి మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లా మహమ్మద్‌నగర్ మండలం తునికిపల్లిలో జరి గింది. గ్రామానికి చెందిన రౌతు సా యిలు (53) గురువారం ఉదయం ఇంట్లో నీటిని విడుదల చేసేందుకు వాటర్ హీటర్‌ను పెట్టాడు. ప్రమాదవశాత్తు హీటర్ చేతికి తగిలి సా యిలు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుని కొడుకు సతీశ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.