14-05-2025 11:05:00 PM
దౌల్తాబాద్: విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి చెందిన సంఘటన దౌల్తాబాద్ మండలం తిరుమలపూర్ గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన గడ్డం సుధాకర్(32) గ్రామంలో విద్యుత్ పనులు చేపడతాడు. ట్రాన్స్ఫార్మర్ ఆఫ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. మృతునికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీరాం ప్రేమ్ దీప్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.