14-05-2025 11:01:02 PM
ఇబ్రహీంపట్నం: కారు ఢీకొట్టిన ఘటనలో ఓ వృద్ధుడు మృతి చెందాడు. ఈ సంఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్(Ibrahimpatnam Police Station) పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధి సీతారాంపేట గ్రామానికి చెందిన మద్దెల ఎట్టయ్య(70), అదే గ్రామంలో రోడ్డు దాటుతున్న క్రమంలో అతివేగంగా వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎట్టయ్యకు తీవ్ర గాయాలవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఇబ్రహీంపట్నం మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.