18 March, 2026 | 8:50 AM

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

18-03-2026 12:00 AM

కల్వకుర్తి మార్చి 17:దురెదురుగా వస్తున్న కారు బొలెరో వాహనం ఢీకొని ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మంగళవారం వెల్దండ మండలంలో చోటుచేసుకుంది.మార్చాలా గ్రామానికి చెందిన గిరిధర్ రెడ్డి (55) జీవనోపాధి కోసం కల్వకుర్తి పట్టణంలో నివసిస్తూ పనిచేస్తున్నారు. పని నిమిత్తం హైదరాబాద్కు వెళ్లి తిరిగి వస్తుండగా హైదరాబాద్‌శ్రీశైలం ప్రధాన రహదారిపై రాగాయిపల్లి సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న బొలెరో వాహనాన్ని ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో గిరిధర్ రెడ్డి తీవ్రంగా గాయపడి సంఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకు ని మృతదేహాన్ని కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.మృతునికి భార్య, ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఈ ఘటనపై తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.