06-09-2025 12:00:00 AM
మహబూబాబాద్, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారి పై గాయత్రి గుట్ట వద్ద కారులో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ప్రాథమిక ఆధారాల ప్రకారంగా కురవి మండలం తాట్య తండాకు చెందిన రాంబాబుగా గుర్తించారు.
కారు డ్రైవర్ సీటులో రాంబాబు మృతదేహం పడి ఉండగా, తలవద్ద రక్తపు మరకలు ఉన్నాయి. సంఘటన స్థలిని డి.ఎస్.పి తిరుపతిరావు సందర్శించి విచారణ జరుపుతున్నారు.