05-09-2025 11:24:53 PM
బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని కొల్లూరు గ్రామ ప్రధాన రహదారిపై గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒరిస్సాకు చెందిన ఇటుక బట్టి కార్మికుడు కళాకండ(56) మృతి చెందారు. బాన్సువాడ పట్టణ సిఐఎం అశోక్ తెలిపిన వివరాల ప్రకారం సోమేశ్వర్ గ్రామ శివారులోని ఇటుక బట్టీలో కార్మికుడిగా పనిచేస్తున్న ఒరిస్సా రాష్ట్రం, బాలంగీర్ జిల్లా, బెల్పారా తాలూకా,బాగ్ధోర్ కాసకుంట గ్రామానికి చెందిన కళాఖండా (56) కు కొల్లూరు రోడ్డులో గురువారం నాడు రాత్రి 9:30 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వాహనం ఢీకొంది.
ఈ ప్రమాదంలో అతని రెండు కాళ్లు విరిగిపోవడంతో పాటు తీవ్ర రక్తస్రావం జరిగింది. సమీపంలోని వ్యక్తులు అంబులెన్స్ కు సమాచారం అందించి బాన్సువాడ ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు. స్థానిక ఆసుపత్రిలో ప్రధమ చికిత్స చేసిన అనంతరం అతనికి మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. అతని బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సిఐ అశోక్ తెలిపారు.