06-09-2025 12:00:00 AM
300 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు
జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర
కామారెడ్డి, సెప్టెంబర్ 5 (విజయ క్రాంతి) ః కామారెడ్డి జిల్లా కేంద్రంలో గణేష్ నిమజ్జన శోభాయాత్రలు శాంతియుతంగా సురక్షితంగా జరగడానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో బందోబస్తుకు వచ్చిన పోలీస్ అధికారులతో, సిబ్బందితో మాట్లాడారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట మైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
గణేష్ శోభయాత్రకు 300 మంది పోలీస్ అధికారులు సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. 120 సీసీ కెమెరాలు, రెండు డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. గణేష్ శోభయాత్రలో పాల్గొనే భక్తుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ రూట్ మ్యాప్ ప్రకారం శోభయాత్ర హ్యాపీగా కొనసాగే విధంగా అధికారులు చూడాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
గణేష్ శోభాయాత్ర మార్గాల్లో ఎలాంటి అవాంతరాలు లేకుండా భారీ కేడ్లు, ట్రాఫిక్ డైవర్షన్ చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో పోలీసు విభాగం తరఫున భద్రత ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలి పారు. ముఖ్యంగా కామారెడ్డి పట్టణంలో ప్రధాన రహదారులపై ట్రాఫిక్ డైవర్షన్లు అమలు చేస్తూ ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఎటువంటి సంఘ టనలు జరగకుండా సమన్వయంతో ఓపికతో పోలీస్ అధికారులు సిబ్బంది పనిచే యాలని సూచించారు. గణేష్ శోభాయాత్ర రూట్ ను పరిశీలించి అవసరమైన సూచనలు ఇచ్చారు. జన సంచారం ఎక్కువగా ఉన్న ప్రదేశాలు, నిమజ్జన ఘాట్లు, ట్రాఫిక్ జంక్షన్‌ల వద్ద అదనపు బందోబస్తు అమలు చేయాలని ఆదేశించారు. బందోబస్తు విధు లు నిర్వహించుటకు తాము తమ సిబ్బంది సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
ఇటీవల వరదల వల్ల ప్రజలు ఎదుర్కొన్న కష్టాల నుండి చేరుకుంటున్నా ఈ సమయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కార్యక్రమాన్ని ప్రశాంతంగా సురక్షితంగా నిర్వహించుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా అదనపల్లి నరసింహారెడ్డి, కామారెడ్డి ఏఎస్పీ చైతన్య రెడ్డి, ఎల్లారెడ్డి డిఎస్పి శ్రీనివాసరావు, సిఐ లు నరహరి, సంపత్ కుమార్, సంతోష్ కుమార్, ఎస్త్స్రలు, ఆర్‌ఎస్త్స్రలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.