30-04-2025 11:21:00 PM
ఇబ్రహీంపట్నం: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి.. చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అబ్దుల్లాపూర్‌మెట్ మండలంకు చెందిన వ్యక్తి భవనం మధుసూధన్ రెడ్డి(74), మన్నెగూడ బస్టాప్ వద్ద రోడ్డు దాటుతుండగా, ఆ సమయంలో ఒక గుర్తు తెలియని వాహనం ఇబ్రహీంపట్నం నుండి బీఎన్ రెడ్డి వైపు అతివేగంగా నిర్లక్ష్యంగా వచ్చి తనపై నుంచి దూసుకెళ్లింది.
దీంతో రోడ్డుపై పడిపోవడంతో తలకు బలమైన గాయాలు అయ్యాయి. చుట్టుపక్కల వారు అతని గమనించి 108 అంబులెన్స్‌ల ద్వారా చికిత్స కోసం కొత్తపేటలోని ఓమ్ని ఆసుపత్రికి తరలించారు. కాగా బుధవారం సాయంత్రం చికిత్స పొందుతూ మరణించారని డ్యూటీ డాక్టర్ ప్రకటించారు. ఈ మేరకు కొడుకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.