04-10-2025 07:51:21 PM
బాన్సువాడ (విజయక్రాంతి): బాత్రూంలో జారీపడి ఆర్టీసీ మహిళా కండక్టర్ మృతి చెందిన సంఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని చైతన్య కాలనీలో చోటుచేసుకుంది. సీఐ అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి బేగరీ సాయవ్వ(49) అనే మహిళా కండక్టర్ పిట్లం గ్రామానికి చెందిన ఆమె ప్రస్తుతం ఆమె భర్త శంకర్ తో కలిసి బాన్సువాడ పట్టణంలోని చైతన్య కాలనీలోని తన అద్దె ఇంట్లో బాత్రూంకు వెళ్లి ప్రమాదవశాత్తు బాత్రూంలో పడిపోగా ఎడమ కంటికి, తల వెనుక భాగంలో దెబ్బలు తగలగా అది గమనించిన కుటుంబ సభ్యులు ప్రైవేట్ అంబులెన్స్ లో బాన్సువాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు అప్పటికే ఆమె చనిపోయినదని నిర్ధారించారు. కుమారుడు సాయి చరణ్ భర్త శంకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.