calender_icon.png 1 November, 2025 | 10:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉన్నత పాఠశాలలో మండల అధికారులు పర్యటించాలి

01-11-2025 06:55:12 PM

బేల,(విజయక్రాంతి): జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండలంలోని ఉన్నత పాఠశాలల్లో నేటి నుండి పదవ తరగతి విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఉత్తర్వులు వచ్చిన సందర్బంగా నేటి నుండి మండల అధికారులు ఉన్నత పాఠశాలకు సందర్శించాలని బేల మండలం ప్రత్యేక అధికారి, ఎస్సి కార్పొరేషన్ ఈడి మనోహర్ రావు పేర్కొన్నారు.

శనివారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో మండల  మండల అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి పలు సూచనలు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... ఉన్నత పాఠశాలలో సంబంధిత పంచాయతీ కార్యదర్శులు పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వార్షిక పరీక్షలను దృష్టిలో ఉంచి పదవ తరగతి విద్యార్థులు మండలానికి మంచి ర్యాంకులు వచ్చేలా చూడాల్సిన బాధ్యత మండల అధికారుల పైన ఉందని అన్నారు. ఈ సమావేశంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.