calender_icon.png 1 November, 2025 | 10:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కలెక్టర్ ఆదేశాలతో విచారణకు వచ్చిన అధికారులు

01-11-2025 06:59:00 PM

బాల్కొండ (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా బాల్కొండ అసెంబ్లీ నియోజక వర్గంలోని నఖాస్ గల్లీలో తెలంగాణ క్రీడా ప్రాంగణంలో క్రీడాకారులకు, సమీపంలోని శ్రీ నిమిషాంబ దేవి ఆలయం భక్తులకు తీవ్ర నీటి ఏడ్డది ఉన్నందున జిల్లా కలెక్టర్ కు ఫర్యాదు చేయగా శుక్రవారం రోజు డివిజనల్ ఇంజనీర్, బాల్కొండ ప్రాంత అసిస్టెంట్ ఇంజనీర్ బాగుల వెంకటేష్ బాల్కొండ మేజర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి జి. రజనీకాంత్ రెడ్డి బాల్కొండకు వచ్చి విచారణ చేసారు.

బాల్కొండ మండల కేంద్రంలోని నఖాస్ గల్లిలో క్రీడా ప్రాంగణంలో క్రీడా కారులకు (24) గంటల పాటు త్రాగునీటీ కోసం బోర్ భావితో పాటు మినీ వాటర్ ట్యాంక్ అవసరం ఉందని అక్టోబర్ 27 తేదీన ప్రజా వాణిలో జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయడంతో అధికారులు స్పందించి విచారణ చేయగా నఖాస్ సంఘానికి చెందిన బి.ఆర్. నరసింగ్ రావు, బి. నరేష్ మంచినీటి సమస్యను ఇంజనీరింగ్ అధికారులకు నీటి ఏడ్డడి గురించి వివరించారు. తెలంగాణలో మిషన్ భగీరత పథకం వచ్చిన తర్వాత బోర్ వెల్ వేయడం లేదని క్రీడాకారులకు, స్థానిక ప్రజలకు (24) గంటల పాటు మంచినీరు కావాలంటే స్థానిక శాసనసభ్యులు  లేదా పార్లమెంట్ సభ్యులను విజ్ఞప్తులు చేసుకుంటే వారి ప్రత్యేక నిధులతో బోర్ వెల్ తో పాటు మినీ వాటర్ ట్యాంక్ అవుతుందని విచారణ అధికారులు వివరించారు.

ఎంపీ - ఎమ్మెల్యే మా సమస్యలు తీర్చండి..

బాల్కొండ మండల కేంద్రంలోని నఖాస్ గల్లీలో తెలంగాణ క్రీడా ప్రాంగణంలో క్రీడాకారులకు, సమీపంలోని శ్రీ నిమిషాంబ దేవి ఆలయం భక్తులకు (24) గంటల పాటు త్రాగునీటీ కోసం బోర్ భావితో పాటు మినీ వాటర్ ట్యాంక్ అవసరం ఉందని నిజామాబాదు మాజి రీజినల్ స్పోర్ట్స్ కో ఆర్డినేటర్ బ్రాహ్మ రౌతు నర్సింగ్ రావు,సీనియర్ క్రీదాకారులు శ్రీకాంత్,బి.నరేష్ కుమార్, కమల్ని,తీష్ కుమార్, మహమ్మద్ అక్షర్, బాల్కొండ నఖాస్ సంఘానికి చెందిన బి. గంగాధర్, బి. సత్యనారాయణ, సంయుక్తంగా బాల్కొండ శాసనసభ్యులకు, పార్లమెంట్ సభ్యులకు, బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ కు క్రీడా ప్రాంగణంలో (24) గంటల పాటు మంచినీరు అందుబాటులో ఉంచే విదంగా బోర్ భావితో పాటు మినీ వాటర్ ట్యాంక్ మoజూరి చెయ్యాలని వారు విజ్ఞప్తి చేశారు.