02-08-2025 06:07:29 PM
ఇటిక్యాల: గద్వాల జిల్లా ఉమ్మడి ఇటిక్యాల మండల కేంద్రములో గల ప్రాథమిక పశువైద్య కేంద్రం సమస్యలకు నిలయంగా మారింది. గత 10 ఎండ్ల క్రితం నిర్మించిన పశు వైద్య కేంద్రము ప్రస్తుతం శిథిలావస్థకు చేరి పెచ్చులు మేకులు ఉడి కింద పడుతుండడంతో సంబంధిత పశు వైద్య అధికారులు బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వర్తిస్తున్నారు, పశువుల చికిత్సకు వచ్చిన మందులు సైతం చిన్నపాటి వర్షం పడితే చాలు తడిసి ముద్దవుతున్నాయి. ఉన్నత స్థాయి అధికారులు స్పందించి మరమ్మతులు చేయించాలని రైతులు కోరుతున్నారు.