02-08-2025 06:04:44 PM
నిర్మల్ (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం సాంస్కృతిక ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao) ఆదివారం జిల్లాలో పర్యటించనున్నట్లు డిసిసి అధ్యక్షులు శ్రీహరి రావు తెలిపారు. మధ్యాహ్నం రెండు గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరిన మంత్రి నాలుగు గంటలకు ఖానాపూర్ కు చేరుకుంటారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాదయాత్రలో ఆయన పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమానికి కుమ్మరి జిల్లా కాంగ్రెస్ నేతలు పెద్దఎత్తున హాజరు కావాలని సూచించారు. ఈ జనహిత పాదయాత్రకు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ పిసిసి అధ్యక్షులు కే మహేష్ కుమార్ గౌడ్ తో పాటు ముఖ్య నేతలు రానున్నట్టు తెలిపారు.