calender_icon.png 2 August, 2025 | 11:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంజాయి సాగు చేస్తే ప్రభుత్వ పథకాలు కట్

02-08-2025 07:41:46 PM

ఎస్ఐ దుర్గారెడ్డి..

కంగ్టి (విజయక్రాంతి): గంజాయి సాగుచేసిన, అమ్మిన కేసు నమోదు చేసి జైలుకు పంపుతామని అలాగే ప్రభుత్వ పథకాలు రద్దు చేయబడుతాయని స్థానిక ఎస్ఐ దుర్గారెడ్డి(SI Durga Reddy) అన్నారు. శనివారం ఆయన తన సిబ్బందితో కలిసి మండలంలోని దెగుల్వాడి గ్రామ శివారులోని పంటపొలాలను పరిశీలించారు. ఈ సందర్బంగా ఎస్ఐ మాట్లాడుతూ, పంటపోలలో అంతర పంటగా గంజాయి సాగుచేసి అమ్ముతున్నట్లు తెలిస్తే కేసు నమోదు చేసి ప్రభుత్వం నుండి వచ్చే ఉచిత పథకాలు రైతుబందు, కరెంటు, పంటబీమా వంటి ఉచిత పతకాలు నిలిపివేయబడుతాయని, వారిపై ప్రత్యేక నిఘా ఉంటుందని అన్నారు. ఎవరైనా గంజాయి సాగుచేస్తున్నట్లు తెలుస్తే పోలీస్ లకు సమాచారం ఇవ్వాలని, చెప్పిన వారి పేర్లు గొప్ప్యంగా ఉంచబడుతాయని అన్నారు.